సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వివక్ష
‘కామ్రేడ్ కల్యాణ్' సక్సెస్మీట్లో ఆర్.నారాయణమూర్తి
వినోదంతో పాటు నక్సల్బరీ నేపథ్యమే ‘కామ్రేడ్ కల్యాణ్’ చిత్ర విజయానికి కారణమని అన్నారు నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కామ్రేడ్ కల్యాణ్’ బ్లాక్బస్టర్ సక్సెస్మీట్కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా విషయంలో సెన్సార్ ప్రవర్తించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్తర్, కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలకు అనుమతినిచ్చారన్నారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ చిత్రం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకం కాదని, సినిమాలో ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరిస్తే కట్స్ చెబుతారా? అలా అయితే మిలటరీకి కూడా అభ్యంతరం చెప్పాలి కదా? అని నారాయణమూర్తి సెన్సార్ వారిని ప్రశ్నించారు. నక్సలైట్లు ఈ దేశ పౌరులు.. భూమిపుత్రులని ఆయన గుర్తు చేశారు. ‘సినిమా మాధ్యమం సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నది.
జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఎన్నో గొప్ప చిత్రాలొచ్చాయి. ‘బస్తర్’ ‘కశ్మీర్ ఫైల్స్’ వంటి చిత్రాలను ఎలా సెన్సార్ చేశారో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సినిమాలను కూడా అదే తీరుగా సెన్సార్ చేయాలి. సినిమాల పట్ల వివక్ష తగదు. పౌరుల తాలూకు భావప్రకటన, రాజ్యాంగ స్వేచ్ఛను గౌరవించాలని సెన్సార్ వారిని కోరుతున్నా’ అని నారాయణ మూర్తి అన్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘కామ్రేడ్ కల్యాణ్’ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

