సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకుడు. ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌తో పాటు ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ ‘మా సంస్థకిది 95వ చిత్రం. మరో మూడు సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
త్వరలో 100 సినిమాల మైలురాయికి చేరుకోబోతున్నాం. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు. ఓ భవనం నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో సినిమా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన ‘యాదమ్మ’ అనే పాట హైలైట్‌గా నిలుస్తుందని సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, రచన, మాటలు, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల.