Sunny Leone | రూత్ లెస్ లేడీ గ్యాంగ్‌స్టర్‌గా సన్నీలియోన్.. ఆసక్తి రేకెత్తిస్తున్న కొటేషన్ గ్యాంగ్ టీజర్
Quotation Gang Teaser | ఈ మధ్య కాలంలో కంటెంట్ కొత్తగా ఉంటే చాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లయిపోతున్నాయి. దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? బాష ఏంటి? అని ఆలోచించకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చాలు హిట్లు చేసేస్తున్నారు.
Quotation Gang Teaser | ఈ మధ్య కాలంలో కంటెంట్ కొత్తగా ఉంటే చాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లయిపోతున్నాయి. దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? బాష ఏంటి? అని ఆలోచించకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చాలు హిట్లు చేసేస్తున్నారు. ఆ మధ్య రిలీజైన కాంతార, మొన్న రిలీజైన 2018 సినిమాలు కూడా అలానే వచ్చి బంపర్ హిట్లయ్యాయి. ఇప్పుడదే తరహాలో మరో బాలీవుడ్ సినిమా తెలుగు రిలీజ్‌కు రెడీ అవుతుంది. అదే కొటేషన్ గ్యాంగ్. జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ కీలకపాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్‌తోనే మేకర్స్ సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ కథగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగినట్లు చూపించారు. హింస అధిక మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తుంది. విజువల్స్ కూడా భయపెట్టేవిధంగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రమ్స్ శివమణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది.
వివేక్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా సినిమాను ప్లాన్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఓటీటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను నిర్మించారు. కానీ అవుట్ పుట్ అదిరిపోవడంతో ఎట్టి పరిస్థుతుల్లో ఈ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

