Inspector Rishi | అడవిలో వరుస హత్యలు.. చంపుతుంది దెయ్యమేనా?
తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలకు కారణమని అక్కడి ప్రజలు చెబుతుంటారు. సీబీసీఐడీకి ప్రభుత్వం కేసు అప్పగిస్తుంది.
Inspector Rishi | తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలకు కారణమని అక్కడి ప్రజలు చెబుతుంటారు. సీబీసీఐడీకి ప్రభుత్వం కేసు అప్పగిస్తుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్త ఇన్స్పెక్టర్ రిషి వస్తాడు. ఊరుజనం మాటలు నమ్మని రిషి, సైంటిఫిక్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషికి, అతని టీమ్కీ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి.
ఈ హత్యలకు కారణం దెయ్యమే అయితే, పరిష్కారం పోలీసులు ఎలా కనుక్కున్నారు? అనే ప్రశ్నకు సమధానంగా రూపొందుతోన్న హారర్ క్రైమ్ వెబ్‌సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. నవీన్‌చంద్ర లీడ్‌రోల్ చేస్తున్నారు. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాళ్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలకపాత్రధారులు. నందిని జేఎస్ దర్శకత్వంలో సుఖ్‌దేవ్ లహరి నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ తమిళ్ ఒరిజినల్లో ఈ నెల 29న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. తాను నటిస్తున్న ‘సత్యభామ’ సెట్లో ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ చూసిన కాజల్ వెబ్‌సిరీస్ బృందాన్ని అభినందించి, తన సోషల్‌మీడియాలో ఈ ట్రైలర్‌ని షేర్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

