ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సెకండ్ సింగిల్ కూడా భిన్నంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుండగా, కథానాయికకు సంబందించిన సాంగ్ వినాయకచవితి సందర్బంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్ కాగా, ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లిలో జరుపుతున్నట్టు తెలుస్తుంది.