Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. డేట్ ఫిక్స్ అయినట్లేనా.!
Pushpa 2 The rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 2 ది రూల్ ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
Pushpa 2 on OTT | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). పుష్ప పార్ట్ 1 (Pushpa The Rise) సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాసింది.
కేవలం హిందీలోనే రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.1850 (Pushpa 2 Breaks Indian Box Office Records) కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తాజాగా పుష్ప రీ లోడెడ్ వెర్షన్ (Pushpa 2 reloaded) అంటూ 20 నిమిషాలు అదనంగా జోడించడంతో మళ్లీ థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు. ఇదిలావుంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీకి (Pushpa 2 The rule OTT Update) సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా జనవరి 30 లేదా 31 నుంచి ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్(Pushpa 2 On Netflix)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఓటీటీ వెర్షన్లో రన్‌టైం దాదాపు 3 గంటల 44 నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం. థియేటర్ వెర్షన్ 3 గంటల 20 నిమిషాలే రన్ అవ్వగా.. దీనికి అదనంగా.. 24 నిమిషాలు ఓటీటీకి జత చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

