Pushpa 2 | భన్వర్‌సింగ్ ప్రతీకారం
‘పుష్ప’ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన పలికిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.
‘పుష్ప’ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన పలికిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. ‘పుష్ప-2’లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్నదని తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది.
మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను గురువారం చిత్ర బృందం వెల్లడించింది. ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేశామని పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్, ఫహద్ ఫాజిల్ సెట్లో ఉన్న వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. దీనికి ‘ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

