Allu Arjun | కొన్ని సంవత్సరాలుగా ‘పుష్ప’ సినిమా కోసమే పనిచేస్తున్నాడు అల్లు అర్జున్. తొలి భాగం విడుదలై అఖండ విజయాన్ని అందుకోగానే, ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీ అయిపోయాడాయన. వందలకోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటమ్ సాంగ్‌ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. అయితే ఆ పాట షూటింగ్ పోస్ట్‌పోన్ అయింది.
అల్లు అర్జున్ అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడమే ఈ పోస్ట్‌పోన్‌కి కారణమని తెలుస్తున్నది. నిజానికి ఈ సినిమాకోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నాడు బన్నీ. ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలోనూ ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యారట. రిహార్సల్స్‌లో కూడా పాల్గొన్నారట. అయితే ఉన్నట్టుండి ఆయన సిక్ అవ్వడంతో షూటింగ్‌ని ఈ నెల రెండోవారానికి మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.