Puri Jagannath | పెంగ్విన్ స్టోరీ పూరీ ఎప్పుడో చెప్పేశాడు.. వైరల్ అవుతున్న వీడియో
Puri Jagannath | ఇటీవల సోషల్ మీడియాను ఓ చిన్న వీడియో ఊపేస్తోంది. రెండు పెంగ్విన్లు కనిపించే ఆ క్లిప్‌లో ఒకటి అక్కడే నిలిచిపోతే, మరో పెంగ్విన్ మాత్రం ఎవరి మాట వినకుండా మంచుపై కొండ వైపు నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు నెట్టింట ‘ఆ ఒక్క పెంగ్విన్’గా మారి ట్రోల్స్, మీమ్స్, చర్చలకు కేంద్రబిందువైంది.
Puri Jagannath | ఇటీవల సోషల్ మీడియాను ఓ చిన్న వీడియో ఊపేస్తోంది. రెండు పెంగ్విన్లు కనిపించే ఆ క్లిప్‌లో ఒకటి అక్కడే నిలిచిపోతే, మరో పెంగ్విన్ మాత్రం ఎవరి మాట వినకుండా మంచుపై కొండ వైపు నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు నెట్టింట ‘ఆ ఒక్క పెంగ్విన్’గా మారి ట్రోల్స్, మీమ్స్, చర్చలకు కేంద్రబిందువైంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే… ఇది కొత్త వీడియో కాదు, దాదాపు 15 ఏళ్ల క్రితం తీసిన దృశ్యం. అయినప్పటికీ, ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతోంది? అన్న ప్రశ్నలకు తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మొదట ఈ వీడియో చూసినవాళ్లకు పెద్దగా అర్థం కాలేదు. “ఒకటి అక్కడే ఎందుకు ఆగిపోయింది? ఇంకొకటి ఎందుకు నీటిలోకి వెళ్లకుండా కొండ వైపు నడిచిపోయింది?” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెట్టారు. కొందరు దీన్ని మనుషుల జీవితాలతో పోల్చుతూ, బ్రేకప్ మీమ్స్‌గా మార్చేశారు. అలా అలా ఈ వీడియో వైరల్ అయిపోయింది.
అయితే ఈ పెంగ్విన్ ప్రవర్తన వెనుక ఉన్న అసలు భావోద్వేగాన్ని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఓ సందర్భంలో వివరించారు. పెంగ్విన్ల జీవనశైలి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామికి చాలా నిబద్ధంగా ఉంటుందని, ఒకసారి జోడీ కుదిరితే జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తుందని పూరి పేర్కొన్నారు. కానీ ఆడ పెంగ్విన్ నమ్మకాన్ని వంచిస్తే, ఆ వియోగాన్ని మగ పెంగ్విన్ తట్టుకోలేకపోతుందని చెప్పారు. అప్పుడు అది తన గుంపును, సముద్రాన్ని కూడా వదిలేసి ఒంటరిగా దూరంగా వెళ్లిపోతుందని, చివరకు ఆ ఒంటరితనం దాని జీవితానికే ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటి సంఘటనకు ప్రతీక కావచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక పెంగ్విన్ అక్కడే ఆగిపోవడం, మరొకటి నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోవడం వెనుక విషాద కథ దాగి ఉందని అనుకుంటున్నారు. అప్పటివరకు సరదాగా చూసిన వీడియో, ఈ కోణం తెలిసిన తర్వాత చాలా మందికి ఎమోషనల్‌గా అనిపిస్తోంది. అన్నేళ్ల క్రితం తీసిన వీడియో ఇప్పుడు తిరిగి వెలుగులోకి రావడానికి కారణం ఇదే భావోద్వేగ కనెక్ట్ కావచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు. చిన్న క్లిప్ అయినా, దాని వెనుక ఉన్న అర్థం తెలిసిన తర్వాత ‘ఆ ఒక్క పెంగ్విన్’ ఇప్పుడు నవ్వులకే కాదు, మనుషుల సంబంధాలపై ఆలోచనలకు కూడా దారి తీస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

