Slumdog Movie | డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (Slumdog – 33 Temple Road). ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ మరియు రీ-రికార్డింగ్ పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోందని చిత్ర యూనిట్ తెలిపిందిజ
పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌కు తోడు రమీ (Ramee) అద్భుతమైన సంగీతం తోడవడంతో ఈ కాంబో థియేటర్లలో ఒక ఎక్స్‌ప్లోజివ్ విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఛార్మి కౌర్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ సేతుపతి సరసన సంయుక్త నటిస్తుండగా.. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో ఏ రేంజ్ ఊరమాస్ లుక్‌లో చూపించబోతున్నారో అని ఫ్యాన్స్ మరియు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.