Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ గంటన్నర పాటు కిక్ బాక్సింగ్ చేశాడు. తీవ్రమైన చమటతో క్లినిక్‌కు వచ్చాడు. అతనికి ఈసీజీ చేస్తే, స్ట్రెయిన్ ఉన్నట్లు తెలిసింది. కొన్ని మందులు ఇచ్చి ఆస్పత్రికి పంపాను. కానీ ఆస్పత్రికి చేరుకునేలోగానే పునీత్ మరణించినట్లు డాక్టర్ రమణారావు చెప్పారు.
బెంగుళూరు: కన్నడ ఫిల్మ్ నటుడు పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar).. అయిదేళ్ల క్రితం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ నటుడి చివరి క్షణాల గురించి డాక్టర్ రమణా రావు తాజాగా కొన్ని అంశాలను వెల్లడించారు. పునీత్ తీవ్రమైన వర్కౌట్ చేసిన తర్వాత తన క్లినిక్‌కు వచ్చాడని, అయితే అతనికి చేసిన ఈసీజీలో కొంత ఇబ్బంది ఉన్నట్లు గ్రహించానని, దీంతో ఎమర్జెన్సీ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించినట్లు డాక్టర్ తెలిపారు.
హీరో పునీత్‌ను అందరూ ముద్దుగా అప్పూ అని పిలిచేవారు. 2021, అక్టోబర్ 29వ తేదీన అతను 46 ఏళ్ల వయసులో గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించాడు. చివరి రోజున అతన్ని బెంగుళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అతని ప్రాణాలను రక్షించలేకపోయారు. పునీత్‌తో తనకు మంచి రిలేషన్ ఉన్నట్లు డాక్టర్ రమణా రావు తెలిపారు. అతను ఓ కుమారుడి లాంటి వాడని, పునీత్..నా రెండో కుమారుడు మంచి ఫ్రెండ్స్ అని, ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు అని డాక్టర్ చెప్పారు.
పునీత్ ప్రాణాలు కోల్పోయిన రోజు జరిగిన ఘటనల గురించి డాక్టర్ రమణా రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జిమ్‌లో గంటన్నర పాటు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తన క్లినిక్‌కు పునీత్ వచ్చినట్లు తెలిపాడు. అయితే తొలిసారి పునీత్ ఆ రోజు కిక్ బాక్సింగ్ ఛేశాడని, దీంతో అతను పూర్తిగా శక్తిని కోల్పోయినట్లు డాక్టర్ పేర్కొన్నారు. అప్పూ క్లినిక్‌కు వచ్చిన సమయంలో నేను అక్కడే ఉన్నానని, అతనికి తీవ్ర స్థాయిలో చమటలు వచ్చాయని, జిమ్‌కు వెళ్లి వస్తున్నట్లు చెప్పాడని, కిక్ బాక్సింగ్ గంటన్నర పాటు చేసినట్లు తెలిపాడన్నాడు. కొత్తగా కిక్ బాక్సింగ్ చేయడం వల్ల అతను అలసిపోయాడని, కానీ అతనికి ఈసీజీ చెకింగ్ చేస్తే ఏదో తేడా ఉన్నట్లు గమనించానన్నాడు. చమట ఎక్కువ రావడం వల్ల ఈసీజీ చేశానని, ఆ ఈసీజీలో స్ట్రెయిన్ ఉన్నట్లు గమనించానని డాక్టర్ తెలిపారు.
పునీత్‌కు వెంటనే మెడిసిన్ ఇచ్చి మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి పంపించామన్నారు. పునీత్ తన స్వంత కారులోనే ఆస్పత్రికి వెళ్లాడని, కారులో వెళ్తూనే అందరితో మాట్లాడాడని, అతనికి కూర్చోవాలని ఉన్నా, తన భార్య అశ్వినీ ఒడిలో తలపెట్టి నిద్రపోవాలని చెప్పినట్లు డాక్టర్ గుర్తు చేశారు. ఆస్పత్రిలో డాక్టర్ రంగ నాయక్ అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో పునీత ఫ్యామిలీకి డాక్టర్ రంగనాయక్ చికిత్స చేశారు. లెజెండరీ నటుడు, పునీత్ తండ్రి రాజ్‌కుమార్‌కు డాక్టర్ రంగనాయక్ చికిత్స చేసేవారు.
అయితే ఆస్పత్రికి చేరుకోవడానికి ఒక నిమిషం ముందే పునీత్ గుండె ఆగినట్లు రమణారావు తెలిపారు. కారులో ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో అతను అందరితో మాట్లాడినట్లు డాక్టర్ చెప్పారు. పునీత్‌ను ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లగానే అతని హార్ట్ బీట్ లేదన్నారు. బెంగుళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో పునీత్‌కు సీపీఆర్ చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

