PS-2 Movie Collections | ఎప్పుడెప్పుడా అని తమిళ తంబీలు ఎంతగానో ఎదురు చూసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 గత శుక్రవారం రిలీజైంది. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువే హైప్ క్రియేట్ అయింది. ఇక రిలీజ్ తర్వాత కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి పార్టు రేంజ్లో కాకపోయినా.. తొలిరోజు బాగానే నెట్టుకొచ్చింది. సినిమా టాక్ బాగుండటంతో రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. టిక్కెట్లు కూడా భారీ సంఖ్యలోనే తెగుతున్నాయి.
కాగా తెలుగులో తొలిపార్టు నిరాశపరచగా.. రెండో భాగం మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. పైగా పోటీగా విడుదలైన ఏజెంట్ తుస్సు మనడంతో సినీ ప్రేక్షకులకు ఈ సినిమానే ఆప్షన్ అయిపోయింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఇక మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.150 కోట్లు కలెక్ట్ చేసి తమిళ నాట సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇదే జోరు కొనసాగితే వారం తిరిగే లోపే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. వీక్ డేస్‌లోనూ బుకింగ్స్ భారీ రేంజ్‌లోనే జరుగుతున్నాయట.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారగణం ఈ సినిమలో నటించారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.