Project K | స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రాజెక్ట్ K రైడర్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్, వీడియో
Project K | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ K (Project k). ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ విడుదల చేయగా.. సూపర్ హీరో అవతార్‌లో అదరగొట్టేస్తున్నాడు ప్రభాస్. ప్రాజెక్ట్ Kలో కనిపించబోయే రైడర్లు ఎలా ఉండబోతున్నారో తెలియజేస్తూ.. ఈవెంట్లో కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్.
Project K | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ K (Project k). సైన్స్ ఫిక్షన్ జోనర్లో మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శాన్ డియాగోలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ విడుదల చేయగా.. సూపర్ హీరో అవతార్‌లో అదరగొట్టేస్తున్నాడు ప్రభాస్. శాన్ డియాగో కామిక్ కాన్ (San Diego Comic-Con (SDCC)) ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ Kలో కనిపించబోయే రైడర్లు ఎలా ఉండబోతున్నారో తెలియజేస్తూ.. ఈవెంట్లో కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్.
బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న రైడర్లు కవచం ధరించి ఆయుధాలతో కనిపిస్తున్నారు. ప్రాజెక్ట్ Kలో ప్రభాస్‌ను ఎదుర్కొనేందుకు, ఓడించేందుకు రైడర్స్ రెడీ అవుతున్నట్టు మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు. రైడర్లు శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. సినిమాలో హాలీవుడ్ మేకర్స్ ప్రాజెక్ట్ K నుంచి ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్ పోస్టర్లు హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు చెబుతున్నాయి.
ఈ మూవీలో దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ గతంలోనే ప్రాజెక్ట్ K రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మూవీ లవర్స్, ప్రభాస్ అభిమానులు టైటిల్, గ్లింప్స్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రాజెక్ట్ K రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ ప్రాజెక్ట్ K తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

