SKN | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బేబి (Baby). మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్ (SKN) తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలువడమే కాకుండా.. నిర్మాత ఎస్కేఎన్కు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఎస్కేఎన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన కొత్త సినిమాల అప్డేట్ అందించాడు. నలుగురు దర్శకులతో దిగిన ఫొటోను ఎస్కేఎన్ షేర్ చేశారు.
రాబోయే సినిమాల్లో ఎవరితో కలిసి పనిచేయబోతున్నారో ఈ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చారు. ఎస్కే బ్యానర్లో తన తర్వాతి చిత్రాన్ని మరోసారి బేబి డైరెక్టర్ సాయిరాజేశ్‌తో చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ముగ్గురు డైరెక్టర్లు సందీప్ రాజ్, సుమన్ పాతూరి, రవి నంబూరితో కూడా సినిమాలుండబోతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్నారు ఎస్కేఎన్.
నలుగురు దర్శకులతో ఎస్కేఎన్..