తెలుగు ఫిలింఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిర్మాత కె. బసిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బసిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాస యాదవ్. బసిరెడ్డి వెంట ఎఫ్డీసీ ఛైర్మన్ పి. రామ్మోహన్ రావు కూడా ఉన్నారు.