Family Star | నన్ను దిల్‌రాజుగా మార్చిన అదే రోజున ‘ఫ్యామిలీ స్టార్’తో వస్తున్నాం
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో నేడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్లో జరుగగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా దర్శకుడు పరశురామ్, నిర్మాత దిల్‌రాజు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ మాట్లాడుతూ.. గీతగోవిందం కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో అందరికి తెలుసు. గీతగోవిందం కంటే ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండనుంది. ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అవుతుంది ఈ చిత్రం. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారు. నన్ను దిల్ రాజులా మార్చిన చిత్రం ‘దిల్’. ఈ చిత్రం ఏప్రిల్ 05న విడుదలైంది. దాదాపు 21 ఏండ్ల తర్వాత మళ్లీ అదే తేదీలో బ్లాక్ బస్టర్ సినిమాతో రానున్నాం అంటూ దిల్‌రాజ్ వెల్లడించారు.
Producer #DilRaju speech at #FamilyStarTrailer Launch event#FamilyStarOnApril5th pic.twitter.com/uCvH56RlGI
— Suresh PRO (@SureshPRO_) March 28, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

