Dil Raju | నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. దిల్ రాజు హెచ్చరిక
Dil Raju | " దిల్ రాజు ఏం రియాక్ట్ అవడు. సాఫ్ట్‌గా వెళ్తాడనుకుంటున్నారా ? తాట తీస్తా. సాఫ్ట్‌గా ఉండాలని చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సరీలను మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుని కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛాన్సల్స్‌కు వాడుకుంటున్నారు. అది తప్పు"
Dil Raju | తప్పుడు వార్తలు రాసే వెబ్సైట్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తానంటూ ఆ వెబ్సైట్లను ఉద్దేశించి హెచ్చరించారు.
హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని ప్రముఖ వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయని దిల్‌రాజు మండిపడ్డారు. ” ఇండస్ట్రీలో పక్కనే ఉంటూ మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ సంక్రాంతి టైంలోనే నాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏడెనమిదేండ్లుగా ఇది నడుస్తూనే ఉంది. చిరంజీవి మాట్లాడుతూ.. దిల్ రాజుకు ఏ టైంలో ఏం చేయాలో తెలుసు అని అన్నారు. కానీ కొన్ని వెబ్సైట్లు చిరంజీవి మాట్లాడిన దాన్ని వక్రీకరించాయి. మీరు నాపై ఏదో రాసి మీ వెబ్సైట్ల ఇంపార్టెన్స్‌ను పెంచుకోవడానికి వేరే వాళ్లను ఎందుకు వాడుకుంటున్నారు. మీకు ఇది అవసరమా” అని దిల్ రాజు ప్రశ్నించారు.
ఈరోజు నుంచి ఊరుకోను..
” దిల్ రాజు ఏం రియాక్ట్ అవడు. సాఫ్ట్‌గా వెళ్తాడనుకుంటున్నారా ? తాట తీస్తా. సాఫ్ట్‌గా ఉండాలని చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సరీలను మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుని కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛాన్సల్స్‌కు వాడుకుంటున్నారు. అది తప్పు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

