అందరికీ కనెక్టయ్యే డార్లింగ్
‘చాలాకాలంగా సినిమా మా జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో వర్క్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నిజానికి సినిమాతో పోలిస్తే బిజినెస్‌నే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను బిజినెస్‌లో క్వాలిఫైడ్. దానిపై మాస్టర్స్ చేశాను.
‘చాలాకాలంగా సినిమా మా జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో వర్క్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నిజానికి సినిమాతో పోలిస్తే బిజినెస్‌నే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను బిజినెస్‌లో క్వాలిఫైడ్. దానిపై మాస్టర్స్ చేశాను. అటు సినిమా, ఇటు బిజినెస్ ఇలా రెండు రంగాల్లోనూ సక్సెస్‌లు చూస్తుండటం గర్వంగా ఉంది.
ఈ క్రెడిబిలిటీ అంతా మా పేరెంట్స్‌దే’ అంటున్నారు నిర్మాత చైతన్యరెడ్డి. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డితో కలిసి ఆమె నిర్మించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్యరెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘హను-మాన్’ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత మా సంస్థనుంచి వస్తున్న సినిమా ఇది. పెళ్లికి ముందు, పెళ్లి అయ్యాక, పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత జీవితాల్లో వచ్చే మార్పుల నేపథ్యంలో సాగే ఈ కథ మా అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది.
రేపు సినిమా చూశాక ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఆ నమ్మకంతోనే సినిమా చేశాం. ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది’ అని చైతన్యరెడ్డి తెలిపారు. మొదట ఈ సినిమాకు ‘వైదిస్ కొలవరి’ అనే టైటిల్ అనుకున్నామని, అందరికీ అర్థం కాదనే ఉద్దేశంతో ‘డార్లింగ్’ అనే టైటిల్ పెట్టి, ‘వైదిస్ కొలవరి’ అనేది ట్యాక్లైన్గా ఫిక్స్ చేశామని, నభానటేశ్, ప్రియదర్శి ఇద్దరికీ ఇందులోని పాత్రలు పర్ఫెక్ట్గా సెట్టయ్యాయని, అద్భుతంగా నటించారని చైతన్యరెడ్డి పేర్కొన్నారు. ‘ ‘జై హనుమాన్’ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ‘హను-మాన్’ని మించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారనేది ఆ హనుమంతుడే డిసైడ్ చేస్తారు’ అని చైతన్యరెడ్డి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

