శ్రీకాంత్, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం ‘తంతిరం’. ముత్యాల మోహర్ దీపక్ దర్శకుడు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రగుల నిర్మించారు. ఈ నెల 22న విడుదలకానుంది. ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది.
భార్యభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిరుగుడి వంశీ శ్రీనివాస్, సంగీతం: అజయ్ అరసడ, దర్శకత్వం: ముత్యాల మోహర్ దీపక్.