శుక్రవారం ఎపిసొడ్లో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ కాస్త నవ్వులు కూడా పంచారు. ముఖ్యంగా సన్నీ అందరిని ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బ నవ్వించాడు. స్పెషల్ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కాజల్ మైక్ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్ టైమ్‌లో సిరి, డిన్నర్ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు.
టిఫిన్ టైమ్‌లో ఎవరు అని సన్నీ ప్రశ్నించగా, సూపర్ యాంకరింగ్ అంటూ రవి కౌంటర్ వేశాడు.ఇక ఇన్నాళ్లు తన గుండెల్లోమ్యూజిక్ తప్ప ఎవరు లేరని, మంచి అమ్మాయి కోసం వెయింటింగ్ అని చెప్పాడు. హౌజ్ మేట్స్ లో ఉన్న అందరు అమ్మాయిలలో ఒక్కో క్వాలిటీని ఎంపిక చేసుకుంటూ అన్ని కలగలసిన అమ్మాయి రావాలని చెప్పాడు.
సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని కౌంటరిచ్చాడు. ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారన్న ప్రశ్నకు సింగర్.. హమీదా పేరు చెప్తూ పాటందుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్ చేశాడు. శ్రీరామ్.. హమీదాతో చాలా చనువుగా ఉండడాన్ని చూసి ప్రియాంక జీర్ణించుకోలేకపోయింది.ఫేస్ ఫీలింగ్స్ పూర్తిగా మార్చేసింది.