బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకున్న క్రమంలో బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్.. ఇంట్లో వాళ్లని పలు ప్రశ్నలు అడిగే అవకాశం దొరికింది. ఈ క్రమంలో అనీ మాస్టర్..సన్నీని ఓ ప్రశ్న అడిగింది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు.
నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని సన్నీ అంటూ అనీ మాస్టర్ అడిగింది. దీనికి సమాధానం ఇచ్చిన సన్నీ.. నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. అనీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే. మీరు నా గుడ్ ఫ్రెండ్ అంటూ స్పష్టం చేశాడు సన్నీ.
ఇక నటరాజ్ మాస్టర్.. శ్రీరామ్‌కి ఓ ప్రశ్న సంధించాడు. ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అని అడిగాడు. దీనికి శ్రీరామ్ .. ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది అని అంటాడు. ఇక ప్రియాంక.. ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? అని మానస్‌ని అడగగా, దానికి మానస్.. కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు అని చెబుతాడు.