ప్రియమణి ‘భామా కలాపం’

ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకుడు. సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ను కథానాయిక రష్మిక మందన్న విడుదలచేసింది. ఈ టీజర్లో పొరుగింట్లో జరిగే విషయాల పట్ల ఆతృత కనబరిచే తత్వమున్న మధ్యతరగతి గృహిణిగా ప్రియమణి కనిపిస్తున్నది. ఓ హత్యకు ఆమె ఎలా ప్రత్యక్షసాక్షిగా నిలిచింది?తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలతో టీజర్ నవ్విస్తూనే ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ కథాంశానికి వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్న వెబ్ మూవీ ఇది. ఇందులో యూట్యూబ్ కుకరీ ఛానెల్ నడిపే మహిళగా, గృహిణిగా భిన్న పార్శాలున్న పాత్రలో ప్రియమణి కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రియమణి అరంగేట్రం చేయనున్నది. ఈ చిత్రానికి ‘డియర్ కామ్రెడ్’ ఫేమ్ భరత్‌కమ్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. జాన్ విజయ్, పమ్మిసాయి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ: దీపక్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

