L2 Empuraan | ‘లుసిఫర్ 2’ సినిమాకి మోహన్‌లాల్ పారితోషికం ఎంతంటే.!
L2 Empuraan | మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది.
L2 Empuraan | మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు పృథ్వీరాజ్. అయితే ఈ సినిమాకు మోహన్ లాల్ తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పృథ్వీరాజ్.
ఆయన మాట్లాడుతూ.. లల్లెట్టన్ (మోహన్‌లాల్) వలనే ఈ సినిమా సాధ్యమైంది. మోహన్‌లాల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక దర్శకుడిగా, నేను నిర్మాతల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాను. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలని భావిస్తాను. ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ కోసం మోహన్‌లాల్ ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆయన పారితోషికం వదులుకోవడం వల్లే ఈ సినిమా తెరకెక్కిందని చెప్పడంలో సందేహం లేదు. ఆయన రెమ్యూనరేషన్‌ను కూడా సినిమా నిర్మాణానికి ఉపయోగించాం. స్క్రీన్‌పై చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గేమ్ ఆఫ్ థోర్న్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్‌తో పాటు చాలా మంది విదేశీ నటులు ఇందులో పాల్గొన్నారు. వారంతా సినిమాకి చాలా సహకారం అందించారంటూ పృథ్వీరాజ్ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

