Rajamouli | రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ అగ్ర నటుడు?
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో వివిధ భారతీయ భాషలకు చెందిన అగ్రతారలతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
Rajamouli | రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో వివిధ భారతీయ భాషలకు చెందిన అగ్రతారలతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి తన సినిమాల్లో విలన్ పాత్రల్ని అత్యంత శక్తివంతులుగా చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో విలన్ క్యారెక్టర్ ఎవరనేది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నది. మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించనున్నారని ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు.
‘ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్నీ ఫైనలైజ్ అయ్యాక చిత్రబృందం ఆ వివరాలను మీతో పంచుకుంటుంది’ అని సమాధానమిచ్చారు. దీంతో ఆయన ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాజమౌళి-మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు జాన్అబ్రహమ్ పేరును కూడా పరిశీలిస్తున్నారని మంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

