Prithviraj Sukumaran | విలన్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారణ్.. ఆసక్తికరంగా ఫస్ట్‌లుక్ పోస్టర్..!
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
Bade Miyan Chote Miyan Movie | మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘కడువా’ పాన్ ఇండియా సినిమాగా రిలీజై మంచి విజయం సాధించింది. ఇక పృథ్విరాజ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తునే పరభాషల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’లో ఈయన ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.
అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కబీర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్లో బ్లూ కలర్ బ్లేజర్ ధరించి స్టైలిష్ విలన్లా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్, ఆజ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Thrilled to be part of this amazing squad @akshaykumar @iTIGERSHROFF @vashubhagnani @aliabbaszafar @jackkybhagnani @honeybhagnani @iHimanshuMehra @poojafilms @AAZFILMZ #BadeMiyanChoteMiyan. Dream combo!! 🔥 pic.twitter.com/rb3pVN02J0
— Prithviraj Sukumaran (@PrithviOfficial) December 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

