Prince Movie | శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ థర్డ్ సింగిల్ రిలీజ్..!
Prince Movie 3rd Single | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. డాక్టర, డాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ప్రిన్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Prince Movie 3rd Single | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ప్రిన్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని ‘హూ ఐయామ్ ఐ’ అనే పాటను రిలీజ్ చేశారు. థమన్ స్వర పరిచిన ఈ పాటను దిన్కర్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. ఇప్పటికే రిలీజైన బింబిలిక్కి పిలాపి, జెస్సికా పాటలకు విశేష స్పందన వచ్చింది. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటించింది. సత్యరాజ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

