డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మంచి అనుభూతిని పంచే సినిమా ఇదని, ఇందులోని పాత్రలను చూసి తమ జీవితాల్లోనూ అలాంటి వాళ్లుంటే బాగుండునని అంతా అనుకుంటున్నారని హీరోహీరోయిన్లు శ్రీరామ్, తపస్విని పూనాచ అన్నారు. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ముందునుంచీ నమ్మకంతో ఉన్నామని, మా నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసిందని నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు.