Premalu Movie | హిలేరియస్‌గా ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్
Premalu Movie | రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మూవీ రూ.11 కోట్ల బడ్జెట్‌తో వచ్చి కేవలం 15 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను తెలుగులో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ విడుదల చేస్తున్నారు.
Premalu Movie | రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మూవీ రూ.11 కోట్ల బడ్జెట్‌తో వచ్చి కేవలం 15 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను తెలుగులో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చి 08న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో రేణు (మమితా బైజూ)ను చూసి ఇష్టపడతాడు సంతోష్ (నెల్సన్ కే గఫూర్). ఈ విషయాన్ని రైలులో రేణుకు చెప్పేందుకు సచిన్ ప్రయత్నిస్తాడు. అయితే, రేణు నిద్రలో ఆ మాట వినదు. ఈ సీన్‌తో ట్రైలర్ మొదలైంది. రేణును ప్రేమలో పడేసేందుకు హైదరాబాద్‌లోనే గేట్ కోచింగ్ తీసుకునేందుకు సచిన్ డిసైడ్ అవుతాడు. అయితే సంతోష్ రేణును ప్రేమలో పడేశాడా. రేణు సంతోష్‌కు ఒకే చెబుతుందా అనేది తేలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ ట్రైలర్ రీసెంట్గా ఫేమస్ అయిన కుమారి ఆంటీ రిఫరెన్స్ వాడుకున్నారు. ‘ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు’ అనే ట్రైలర్లో ఫన్నీగా సాగింది.
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fazil) నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

