Premalu OTT | మలయాళం నుంచి వచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ప్రేమలు (Premalu). తెలంగాణ, హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంమాలీవుడ్లో విడుదలై ఒక్క కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మార్చి 08న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు తెలుగులో రూ.12 కోట్లకు పైగా వసూళ్లను తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 29 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా హైదరాబాద్‌లోనే జరుపుకోవడం విశేషం. కేరళ నుంచి తెలంగాణకు జాబ్ చేయడానికి వచ్చిన మలయాళీలు ఇక్కడ ఎలా ఉన్నారు అనే చిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది.
#Premalu – 29th March – Hot star pic.twitter.com/QOIiZvojmX
— Movies4u (@Movies4uOfficl) March 19, 2024