సంగీత్ శోభన్, సాన్వి మేఘన జంటగా నటిస్తున్న ‘ప్రేమ విమానం’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సంతోష్ కట దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్‌నివ్వగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విఛాన్ చేశారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించబోతున్నామని, యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయని చిత్రబృందం పేర్కొంది. కల్పలత, సుప్రీత్, శైలజప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: అనూప్‌రూబెన్స్, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, దర్శకత్వం: సంతోష్ కట.