‘సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందరలింగానికి సోలో స్నేహితుడైన ప్రేమ్‌కుమార్ పెళ్లి ఎందుకు ఆగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సంతోష్‌శోభన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడు. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీసింగ్ కథానాయిక. బుధవారం సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ్‌కుమార్ అనే యువకుడి కథ ఇది. పీకే అని అందరూ పిలిచే అతడికి పెళ్లి అవుతుందా? బ్రహ్మచారిగానే ఉండిపోతాడా? అన్నది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. ఆద్యంతం వినోదభరితంగా సినిమా సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. రుచిత, కృష్ణచైతన్య, సుదర్శన్, అశోక్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనంత్ శ్రీకర్.