అందాల నటీమణులు ఎంత బిజీగా ఉన్నా కూడా జిమ్‌లో వర్కవుట్స్ చేయడం మానడం లేదు. ఏ మాత్రం సమయం ఉన్నా జిమ్‌కి ప్రత్యేక టైం కేటాయిస్తుంటారు. జీరో సైజ్‌లో మారేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేయడం, ప్రత్యేక డైట్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు.
అందం, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీస్ తమ వర్కౌట్స్ వీడియోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు.తాజాగా నటి,పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా తన ఇన్‌స్టాలో వర్కవుట్ వీడియో షేర్ చేసింది. ఇందులో జిమ్ ఇన్‌స్ట్రుమెంట్‌పై వెరైటీగా వర్కవుట్స్ చేస్తుంది.
నటిగా కొనసాగకపోయిన కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రీతీ జింతా చేస్తున్నకృషిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాలుగు పదుల వయస్సులోనూ మీరు ఇంతంగా ఉండేందుకు కారణం ఇదా అంటూ నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.