నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా పండక్కి అక్టోబర్ 5న తెరపైకి రాబోతున్నది.
సినిమాలోని వేగం అనే లిరికల్ పాటను ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు. ఈ పాటను భరత్, సౌరబ్ స్వరపర్చగా..రమ్య బెహరా పాడారు. కృష్ణ మాదినేని సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. టార్గెట్ మిషన్ పూర్తయ్యాక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ పాటగా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.