Singer Pravasthi | పాడుతా తీయగా జడ్జెస్‌పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు.. ఏంటి ఇలా?
Singer Pravasthi | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన 'పాడుతా తీయగాస షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో అప్రతిహతంగా సాగుతూ వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం మరిణించిన తర్వాత ఈ షోని ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు.ఈ షోకి సునీత, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
Singer Pravasthi | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన ‘పాడుతా తీయగాస షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో అప్రతిహతంగా సాగుతూ వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం మరిణించిన తర్వాత ఈ షోని ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు.ఈ షోకి సునీత, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లి సిరీస్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పట్నుంచే తన అద్భుతమైన గానంతో మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి.
బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్ పలు సందర్భాలలో ఆమె టాలెంట్‌ని ప్రశంసించారు. అయితే ఇటీవలే షో నుండి ప్రవస్తి ఎలిమినేట్ అయింది. ఎంతో గొప్ప సింగర అయిన ప్రవస్తి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్ అవడం ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇక తన ఎలిమినేషన్‌పై ప్రవస్తి రియాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కి వెళ్లాలనుకుంటున్న సింగర్స్‌కి నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్ లేదా జడ్జీల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే షోకి వెళ్లండి.. లేదంటే మీకు అన్యాయం, మానసిక వేదన మిగులుతుంది అని చెప్పుకొచ్చింది.
ఇక ప్రవస్తి పోస్ట్‌లపై ఆమెని కొందరు పర్సనల్‌గా ఎటాక్ చేస్తున్నారు. దానిపై ప్రవస్తి స్పందిస్తూ.. దమ్ముంటే నీ ఒరిజినల్ అకౌంట్ నుంచి మెసేజ్ చెయి.. ఇలా ఫేకెంట్ అకౌంట్ నుంచి కాదు అంటూ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ఆ తర్వాత నేను ఈ షో గురించి మాట్లాడగానే నా తోటి ఎక్స్ కంటెస్టెంట్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నన్ను తిడుతున్నారు.. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.. నేను ఎక్కడ వాళ్ల గొంతు గుర్తుపడతానేమోనని భయపడుతున్నారు.. అయినా ఈ కామెంట్ చేసిందెవరో నాకు తెలుసు అంటూ ప్రవస్తి మరో పోస్ట్ పెట్టింది. షోలో జడ్జిలు నన్ను చీడపురుగులా చూసేవాళ్ళు అని పేర్కొంది. నా బాడీ మీద కూడా వారు జోక్స్ వేశారు. తమిళంలో కూడా చాలా షోలు చేశాను కానీ ఎక్కడా ఇలా చూడలేదు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్లు, ఎక్స్ పోజింగ్ చేయమనేవాళ్లు, చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారు. అలా ఇబ్బంది పడుకుంటూనే పాటలు పాడాను. కాస్ట్యూమ్ డిజైనర్ బాడీ షేమింగ్ చేశాడు. ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అని అనేవారు. 2017 వరకు కూడా ఇలా లేదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పట్నుంచే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశస్తి పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

