Prathinidhi-2 Movie | పొలిటికల్ కంటెంట్తో ‘ప్రతినిధి 2’.. ట్రైలర్ చూశారా.!
Prathinidhi-2 Movie | టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. చివరగా ఆయన ఐదేళ్ల కిందట వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు.
Prathinidhi-2 Movie | టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. చివరగా ఆయన ఐదేళ్ల కిందట వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు. ఆ తరువాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మూవీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్రలో అలరించనున్నాడు. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

