Prakash Raj | ‘స్పిరిట్’ నుంచి ప్రకాశ్ రాజ్ ఔట్.. ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఇదేనా?
Prakash Raj | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.
Prakash Raj | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ కీలక నటుడు తప్పుకున్నట్లు అధికారికంగా వెల్లడైంది. స్పిరిట్ లో కీలక పాత్రలో ఆ నటుడు నటించనున్నారని గతంలో వార్తలు రాగా, ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా ప్రకాశ్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా నిర్మాత ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు అధికారిక క్లారిటీ వచ్చింది. అయితే అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారు? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రకాశ్ రాజ్‌ను ఓ విషయంలో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ విడుదలయ్యే వరకు రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలకు కొంత దూరంగా ఉండాలని ప్రకాశ్ రాజ్‌ను సందీప్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తుంటారు. ఈ వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తుంటాయి.
దీంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఎలాంటి వివాదాల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు ఈ సూచన చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు, నటుడిగా తన వృత్తిపరమైన జీవితానికి సంబంధం లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో దర్శకుడు, నటుడి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు పరస్పర అవగాహనతోనే ప్రాజెక్ట్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి ఇదే అసలు కారణమా? అనే విషయంపై చిత్ర బృందం నుంచి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

