Prakash Raj | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన అన్న నాగబాబు పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా స్పందించారు. అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ మాటే శాసనమని, ఆయనకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసని నాగబాబు ట్వీట్ చేశారు. నాయకుడు నడిచే దారిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మిగతా వాళ్లకు తెలియదని.. కాబట్టి ఎవరూ నోరెత్తకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆయన వెనకాల నడవాలని నాగబాబు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. “ప్రశ్నించకుండా వెనకాల వెళ్లడానికి మేమేమీ గొర్రెలం కాదు.. బానిస బ్రతుకులు బ్రతకడానికి సిద్ధంగా లేము” అని నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది తమ హక్కని స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద లీడర్ అయినా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని గుర్తు చేస్తూ.. తన స్టైల్లో #JustAsking అంటూ ట్వీట్ చేశారు.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు… బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT— Prakash Raj (@prakashraaj) June 6, 2026