PrakashRaj | ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడం వృథా.. ప్రకాశ్‌రాజ్ భావోద్వేగం
PrakashRaj | మంచు విష్ణు ప్యానెల్‌పై 'మా' ఎన్నికల అధికారికి శ్రీకాంత్, జీవితా రాజశేఖర్‌తో కలిసి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. 'మా' ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ప్రకాశ్‌రాజ్

మంచు విష్ణు ప్యానెల్‌పై ‘మా’ ఎన్నికల అధికారికి శ్రీకాంత్, జీవితా రాజశేఖర్‌తో కలిసి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని తెలిపారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు కుట్ర చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుంచి సంతకాలు సేకరించి, నిన్న ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కట్టారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు లేఖ రాసి డబ్బు కట్టాలి. కానీ అది జరగలేదన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి పోస్టల్ డబ్బులు కూడా విష్ణు తరపు వ్యక్తే కట్టారు. దీనిపై కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వృథా అని ప్రకాశ్‌రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

