సిని‘మా’కోసం మనం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు చిత్రపరిశ్రమలో ఆసక్తికరమైన చర్చలకు తెరతీస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించనుండగా ఇప్పటికే ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష బరిలోకి దిగబోతున్నట్లు ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష బరిలో నిలిచిన విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ గురువారం 27 మందితో కూడిన తన ప్యానల్ సభ్యుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకొని ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా, పదవులు కాదు..పనులు మాత్రమే చేయడం కోసం మీ అందరి ఆశీస్సులతో ‘మా’ టీమ్ రాబోతుంది’ అని అన్నారు. ఆయన ప్యానల్లో జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనితచౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్‌రావు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

