విధికి ఎదురీత

పాత్రల పరంగా సహజత్వాన్ని కనబరచడానికి ఎంతటి ప్రయాసకైనా సిద్ధపడుతున్నారు నేటితరం నాయకానాయికలు. తమిళ చిత్రం ‘పోయిక్కల్ కూతురై’ సినిమాలో అంగవైకల్యంతో బాధపడే చాలెంజింగ్ పాత్రలో ప్రభుదేవా కనిపిస్తున్నారు. ప్రోస్థటిక్ లెగ్‌తో చిన్నారిని భుజాన ఎత్తుకొని ఉన్న ప్రభుదేవా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. ఈ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా మొత్తంలో ప్రభుదేవా నిజమైన ప్రోస్థటిక్ లెగ్‌ను ఉపయోగించి నటించారని చిత్ర దర్శకుడు సంతోష్జయకుమార్ తెలిపారు. ప్రోస్థటిక్ లెగ్‌ను ఉపయోగిస్తూ నడవడంలో నిపుణుల సాయంతో ప్రత్యేకంగా ప్రభుదేవా శిక్షణ తీసుకున్నారని ఆయన తెలిపారు. కొన్నిసార్లు బ్యాలెన్స్ కుదరక ఆయన గాయపడిన సందర్భాలున్నాయని, అయితే పాత్రలో పరిణతి కనబరచడానికి వాటన్నింటిని ఓర్చుకొంటూ నటించారని దర్శకుడు పేర్కొన్నారు. వైకల్యంతో బాధపడుతున్నా విధికి ఎదురీదుతూ ఓ తండ్రి ఎలాంటి పోరాటం చేశాడనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

