PD54|షాకింగ్ గెటప్‌తో షేక్ చేయబోతున్న ప్రభుదేవా..!

ప్రభుదేవా మల్టీ టాలెంటెడ్ అనే సంగతి మనందరికి తెలిసిందే.ఆయన నటుడిగా, డ్యాన్సర్‌గా, దర్శకుడిగా ఇలా పలు విభాగాలలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తిన ప్రభుదేవా.. బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ నటుడిగా అలరించబోతున్నాడు
ప్రస్తుతం ”పొయిక్కల్ కుతిరాయ్ అనే సినిమా చేస్తుండగా, సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘పొయిక్కల్ కుతిరాయ్’ ఫస్ట్ లుక్ లో ఆర్టిఫిషియల్ లెగ్ తో ఉన్న ప్రభుదేవా.. ఒక చేతిలో చిన్న పాపను మరొక చేతిలో పెద్ద స్పానర్ ని పట్టుకొని పట్టుకొని కనిపిస్తున్నాడు.
వికలాంగుడు అయిన వ్యక్తి తన కూతురిని శత్రువుల నుండి ఎలా కాపాడుతాడనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ప్రభుదేవా చాలా ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ప్రభుదేవా కు 54వ చిత్రం కాగా ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ , రైజా విల్సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , సముద్రఖని మరియు జాన్ కొక్కెన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
‘హర హర మహాదేవ’ ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ వంటి అడల్ట్ కామెడీ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంతోష్ జయకుమార్.. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘పొయిక్కల్ కుతిరాయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

