Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదల తేదీలకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ సినిమాను తొలుత డిసెంబర్ 3, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఈ చిత్రాన్ని 2027 మార్చికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఒకవేళ ‘ఫౌజీ’ విడుదల తేదీ మార్చికి మారితే, అది ప్రభాస్ ఇతర సినిమాల షెడ్యూల్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న భారీ బడ్జెట్ సినిమా ‘స్పిరిట్’ను మార్చి 5, 2027న విడుదల చేసేలా ఇదివరకే షెడ్యూల్ ప్రకటించారు. ‘ఫౌజీ’ డేట్ మారుతుందనే ప్రచారం నేపథ్యంలో ‘స్పిరిట్’ విడుదల కూడా వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. నిర్మాణ సంస్థల నుంచి తుది నిర్ణయం వెలువడితేనే ఈ డేట్లపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.