Nayakudu| కోలీవుడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మామన్నన్ (Maamannan). ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), పాపులర్ స్టార్ కమెడియన్ వడివేలు (Vadivelu) కీలక పాత్రల్లో నటించారు. తమిళనాడులో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో నాయకుడు (Nayakudu) టైటిల్‌తో విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ.. మేకర్స్ పోస్టర్ కూడా షేర్ చేశారు.
నాయకుడు నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి స్పందన రాబట్టుకుంటోంది. కాగా ఈ సినిమా టీంకు శుభాకాంక్షలు తెలియజేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ పాసిల్, మారి సెల్వరాజ్ టీంకు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని ఏసియన్ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో సంయుక్తంగా విడుదల చేశాయి. ఇప్పటికే లీడ్ రోల్స్‌తో డిజైన్ చేసిన నాయకుడు పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రెడ్ జియాంట్ మూవీస్‌పై ఎం షెంగబాగ్ మూర్తి, ఆర్ అర్జున్ దురై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మామన్నన్ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వడివేలు వన్ మ్యాన్ షోలా సినిమా సాగుతుందని ఇప్పటికే వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి.