యూనివర్సల్ ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). ప్రభాస్ (Prabhas) , పూజాహెగ్డే ( Pooja Hegde) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్ (radha krishna kumar) డైరెక్ట్ చేస్తున్నాడు. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రాధేశ్యామ్ టీం ముంబై గ్రాండ్ ఈవెంట్లో జాయిన్ అయింది. ఈవెంట్లో జరిపిన చిట్ చాట్‌లో తాను ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పాడు ప్రభాస్.
ప్రేమను ఎలా అంచనా (love prediction)వేస్తారని ప్రభాస్‌ను ప్రశ్నించగా..బిగ్గరగా నవ్వాడు యంగ్ రెబల్ స్టార్. భవిష్యత్‌ను పర్ఫెక్ట్గా అంచనా వేయగల హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు.
సినిమాలో ప్రేమపై మీరు చెప్పే డైలాగ్ అంత సరిగ్గా ఉండదు..రియల్‌లైఫ్ లో ప్రేమపై మీ అభిప్రాయమేంటి అని ప్రభాస్ అడుగగా..ప్రేమపై నా అంచనాలు ఎప్పుడూ తప్పుగా ఉంటాయి. అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు..అని చెప్పాడు. లవ్ అండ్ మ్యారేజ్‌పై ప్రభాస్ తనదైన స్టైల్లో ఫన్నీగా చెప్పిన సమాధానం అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
ముంబైలోని జుహూలో సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా…రాజమౌళి వాయిస్ ఓవర్‌తో విజువల్ ఫీస్ట్‌గా సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. రాధేశ్యామ్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైపట్టణాల్లో కూడా ప్రమోషన్స్ తో సందడి చేయనుంది ప్రభాస్ టీం.