Salaar | ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. రోమాంచితమైన యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్‌తో ప్రేక్షకుల్ని కేజీఎఫ్ ప్రపంచంలోకి తీసుకెళ్లి సరికొత్త అనుభూతిని పంచారు. దాంతో ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రంపై నిర్మాణ దశ నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి నిరీక్షణకు తెరదించుతూ గురువారం ‘సలార్’ టీజర్ విడుదలైంది. ై ఈ టీజర్లో ప్రభాస్ రగ్గ్డ్ లుక్స్‌తో కనిపించారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తన మార్క్ ఎలివేషన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘సలార్’ యూనివర్స్‌లో భాగంగా పార్ట్-1గా ఈ చిత్రం రానున్నట్లు టీజర్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ప్పథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.