Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం రాజాసాబ్ (Raja Saab). ఇప్పటికే టైటిల్‌ను ఫైనల్ చేస్తూ ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. హార్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం రాజాసాబ్ చిత్రాన్ని 2024 డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారన్న గాసిప్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తోన్న Kalki 2898 AD మే 9న విడుదల కానుంది. ఒకవేళ మారుతి టీం ఫైనల్ చేసిన రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే అయితే ప్రభాస్ అభిమానులకు ఈ ఏడాది రెండు సినిమాల రూపంలో డబుల్ బొనాంజా రానుందన్నమాట.
రాజాసాబ్ చిత్రంలో మరో బ్యూటీ రిద్ది కుమార్ కీ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న మరో చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ తెరకెక్కిస్తున్నారు.
Probably the best #Sankranthi I’m having 🙂
It’s official now… presenting #TheRajaSaab to all of you 🤗🤗
Need all of ur blessings ♥️Chaala days nunchi, eppudu eppudu ani waiting. Finally it happened today. Darling ni ela chudali anukunnaro… ala choodabotunnaru… Promise !!… pic.twitter.com/02nkHBbpk3
— Director Maruthi (@DirectorMaruthi) January 15, 2024
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023