Prabhas | వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. రాజాడిలక్స్ సెట్స్ నుండి లీకైన డార్లింగ్ ఫోటో..!
ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒకంత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
Raja Delux Movie | ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ డ్రామా ఒకటి. ప్రస్తుతం చిత్రయూనిట్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే షూటింగ్ సెట్లో ప్రభాస్‌కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
లీకైన ఫోటోలో ప్రభాస్ , మారుతి పక్క పక్కనే కూర్చున్నారు. ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ ఫోటోతో డార్లింగ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. వింటేజ్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. తాతగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒకంత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను మారుతి హాండిల్ చేస్తాడా అనే డౌట్ అభిమానుల్లో మెదులుతుంది. అయితే తాజాగా లీకైనా ప్రభాస్ లుక్ చూసి మారుతిపై కాస్త నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

