Maruthi | బాహుబలి ప్రాంఛైజీ తర్వాత యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ఈ గ్లోబల్ స్టార్ హీరో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ చిత్రం హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రిద్ది కుమార్ మరో కీ రోల్ పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చాలా కాలం తర్వాత ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు మారుతి.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ…ప్రభాస్ సినిమా కోసం చెమటోడ్చి తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇది నా జీవితంలో లభించిన ఉత్తమ అవకాశం. ఈ సినిమా నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ ఇంత పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నా పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాన్నంతా ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చాడు. మారుతి కామెంట్స్‌తో ప్రభాస్ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింద.
ఇప్పటికే ప్రభాస్ నుదుటన బొట్టు, లాంగ్ హెయిర్, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్ (Riddhi Kumar)తో క్లోజప్ యాంగిల్లో ఉన్న స్టిల్నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ మరోవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K , మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ ఉన్నాయి. ఈ సినిమాల షెడ్యూల్స్ కు అనుగుణంగా మారుతి సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు యంగ్ రెబల్ స్టార్.
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023