Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో (Prabhas – Maruthi ) ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి తన తాజా ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సంబధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు.
ప్రసుతం ప్రభాస్ చేస్తున్న సలార్, కల్కి .. ఈ రెండు కూడా పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలే. ఈ సినిమాల్లో ప్రభాస్ పాత్ర ఇంటెన్స్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గా వుంటుంది. అయితే మారుతి సినిమాలో మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించబోతున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్ పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుందని చెప్పుకొచ్చారు మారుతి. అలాగే ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ పరిశీలిస్తున్నామని, అందులో ఒకటి త్వరలోనే ఫైనల్ చేస్తామని చెప్పారు మారుతి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న విడుదలకు సిద్దమౌతుంది. అలాగే కల్కి కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని గతంలో మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదల కల్కి గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.