Raja deluxe | ప్రభాస్-మారుతి సినిమా మ్యూజికల్ అప్డేట్
Raja deluxe | మారుతి (Maruthi) తెరకెక్కిస్తున్న హార్రర్ కామెడీ రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్). ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.
Raja deluxe| టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) తెరకెక్కిస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్). పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తుండగా..మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ఇంతకీ ఏంటనుకుంటున్నారా..? మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పించే థమన్ ఈ సినిమాకు పనిచేయబోతున్నాడని తెలిసిందే.
తాజా టాక్ ప్రకారం జూన్ మొదటి వారం నుంచి థమన్ తన కంపోజింగ్ వర్క్ షురూ చేయబోతున్నాడు. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై థమన్- ప్రభాస్ కాంబో మ్యూజిక్ విజువల్ ట్రీట్‌లా ఉండటం ఖాయమైనట్టేనంటున్నారు అభిమానులు. రాజా డీలక్స్ లో ప్రభాస్ చాలా కాలం తర్వాత తనలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నాడని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో అర్థమవుతోంది.
ఈ చిత్రంలో మరో భామ రిద్ది కుమార్ (Riddhi Kumar)కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే మరో అప్డేట్ కూడా స్టిల్ రూపంలో బయటకు వచ్చింది. ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K , కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

